రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏమిటి? హైకోర్టు ప్రశ్న

January 22, 2021


img

తెలంగాణ హైకోర్టు కరోనా పరీక్షల వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నియంత్రణపై పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవడం గతంలో వాటిపై పలుమార్లు హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గురువారం మళ్ళీ ఆ కేసు విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హాజరయ్యారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకొహ్లీ దేశరాజధానిలో రోజుకు 40,000 పరీక్షలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 40,000 కంటే తక్కువ పరీక్షలు మాత్రమే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కరోనా నియంత్రణపై ఇ కేసులు దాఖలావాదంపై ఆమె ఆశ్చర్యామ్ వ్యక్తం చేశారు.

జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లాల వారీగా చేసిన కరోనా పరీక్షల తాలూకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిలో పాజిటివ్ కేసులు, క్వారెంటైన్ కేసుల వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించింది.


Related Post