అక్బరుద్దీన్, బండి సంజయ్‌లపై కేసులు నమోదు

November 28, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేసినందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలపై సెక్షన్ 505 కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ ఘాట్, పీవీ నరసింహారావు సమాధులను కూల్చివేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ అనగా, అదే జరిగితే పాతబస్తీలోని దారుసలాంను కూల్చివేస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. వారిరువురు చేస్తున్న ఇటువంటి ఉద్రేకపూరిత ప్రసంగాలతో హిందూ, ముస్లింల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.       

అయితే పోలీసులు కేసులు నమోదు చేయడం వలన ఎదురయ్యే ఇబ్బందులకంటే వారికి ప్రయోజనమే కలుగుతుందని చెప్పవచ్చు. పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని వారు తమ ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకొని ప్రజల సానుభూతి పొంది తమ పార్టీలకు ఎన్నికలలో లబ్ది కలిగేలా మలుచుకొనే ప్రయత్నం చేయడం తధ్యం. 



Related Post