జీహెచ్‌ఎంసీ 150 డివిజన్లకు...2,226 నామినేషన్లు

November 21, 2020


img

జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లకు శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసేసరికి మొత్తం 2,226 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో బిజెపి 494, టిఆర్ఎస్‌ 493, కాంగ్రెస్‌ 312, టిడిపి 186, మజ్లీస్‌ 66, సిపిఎం 24, సిపిఐ 15, ఇతర పార్టీలు 86, స్వతంత్ర అభ్యర్ధులు 550 నామినేషన్లు ఉన్నాయి. నిన్న చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు చాలా భారీ సంఖ్యలో అభ్యర్ధులు తరలివచ్చారు. దాంతో మధ్యాహ్నం 3 గంటలలోపు వచ్చినవారందరి నామినేషన్లను సాయంత్రం 6-7 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. నిన్న ఒక్కరోజే 1,646 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ్ళ నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు. ఆ తరువాత ఆదివారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్ధుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. డిసెంబర్‌ 1వ తేదీన పోలింగ్ జరిపి, 4వ తేదీన ఓట్లు లెక్కించి ఆదేరోజున ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటిస్తుంది.     Related Post