మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగం

October 20, 2020


img

ఇవాళ్ళ అంటే మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ టీవీ మాద్యమం ద్వారా దేశప్రజలనుద్దేశ్యించి ప్రసంగించబోతున్నారు. “ఇవాళ్ళ సాయంత్రం 6 గంటలకు దేశప్రజలతో ఒక సందేశం పంచుకోవాలనుకొంటున్నాను,” అని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఆయన దేని గురించి మాట్లాడబోతున్నారో చెప్పకపోవడంతో ఊహించుకోవలసివస్తోంది. బహుశః దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండటం గురించి లేదా కరోనాకు వ్యాక్సిన్‌ సిద్దమైందనో ప్రకటన చేయవచ్చు. ఒకవేళ వ్యాక్సిన్‌ సిద్దమైతే దానిని దేశప్రజలకు ఎప్పటి నుంచి ఏవిధంగా పంపిణీ చేయబోతున్నారో తెలియజేయవచ్చు. సరిహద్దుల వద్ద చైనాతో ఏర్పడిన ఘర్షణలు గురించి ప్రస్తావించి, చైనాను ఏవిధంగా కట్టడి చేస్తున్నామో చెప్పే ప్రయత్నం చేయవచ్చు. మరో మూడు గంటలలో ఎలాగూ ప్రధాని నరేంద్రమోడీయే స్వయంగా చెపుతారు కనుక తినబోతు గారెల రుచి ఎలా ఉందని అడగడం దేనికి?    Related Post