విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

October 16, 2020


img

విజయవాడవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు నేడు ప్రారంభోత్సవం జరిగింది. ఢిల్లీ నుంచి కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కారీ, అమరావతి నుంచి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నేడు వర్చువల్ పద్దతిలో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను నేడు ప్రారంభించారు. దీంతోపాటు ఏపీలో నిర్మించిన 9 జాతీయ రహదారులను ప్రారంభించారు. ఏపీలో వివిద జిల్లాలలో కొత్తగా నిర్మించబోతున్న మరో 16 ఫ్లై ఓవర్‌ నిర్మాణపనులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఢిల్లీ నుంచే వర్చువల్ పద్దతిలో శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవికాక రూ.15,592 కోట్లు వ్యయంతో దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న మరో 61 కొత్త ప్రాజెక్టులకు నితిన్ గడ్కారీ ఇవాళ్ళ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 



2015లో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు శంఖుస్థాపన చేశారు. రూ.502 కోట్లు వ్యయంతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దానిలో కేంద్రం రూ.355.8 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.146 కోట్లు భరించాయి. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు మణిహారంలా కృష్ణానది ఒడ్డున దీనిని నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌ పొడవు 2.6కిమీ. ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌ రోడ్లలో సాధారణంగా నాలుగు లేన్లు మాత్రమే ఉంటాయి. కానీ దీనిలో ఆరు లేన్లు ఉన్నాయి. ఢిల్లీ, ముంబైల  తరువాత ఆరులేన్లు కలిగిన ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌ ఇదే. దక్షిణాది రాష్ట్రాలలో ఇదే మొట్టమొదటి ప్రాజెక్ట్.


Related Post