పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బ్రేక్ వేసిన ఎన్‌జీటి

May 21, 2020


img

తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను పట్టించుకోకుండా ఉమ్మడి శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు చేపట్టడానికి సిద్దం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యూనల్ (ఎన్‌జీటి) బ్రేకులు వేసింది. 

నారాయనపేట జిల్లా బాపనపల్లి గ్రామానికి చెందిన గవిగోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై బుదవారం విచారణ చేపట్టిన ఎన్‌జీటి ద్విసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణానికి సిద్దపడుతుండటాన్ని తప్పు పట్టింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆదేశించింది. ఆ ప్రాజెక్టుకు సంబందించి అన్ని అంశాలపై అధ్యయనం చేసేందుకు ఒక నిపుణుల కమిటీని కూడా వేసింది. నివేదిక తయారుచేసి ఇచ్చేందుకు రెండు నెలలు గడువు విధించింది. కనుక కనీసం అప్పటివరకు ఏపీ ప్రభుత్వానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దాని కోసం టెండర్లు కూడా పిలిచినందున అది ఎన్‌జీటి తాజా ఆదేశాలపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 


Related Post