హైదరాబాద్‌లో నేడు మరో ఫ్లైఓవర్‌కు ప్రారంభోత్సవం

May 21, 2020


img

హైదరాబాద్‌ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలో కొత్తగా అనేక ఫ్లైఓవర్లు, అండర్-పాస్ రోడ్లు ప్రభుత్వం నిర్మిస్తోంది. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌లో భాగంగా నిర్మించిన ఫస్ట్-లెవెల్ ఫ్లైఓవర్‌ను నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. రూ.30.26 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ పొడవు 690 మీటర్లు, వెడల్పు 11.50 మీటర్లు. దీనిని మూడు లేన్లతో నిర్మించారు. దీంతో జెఎన్టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు గల 12 కిమీ కారిడార్లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్‌ పనులు పూర్తయ్యాయి. నేటి నుంచి ఈ ఫస్ట్-లెవెల్ ఫ్లైఓవర్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తుండటంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం వైపు రాయదుర్గం వెళ్ళేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.     



Related Post