ఏప్రిల్ 15 నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేత?

April 02, 2020


img

ఏప్రిల్ 14తో దేశంలో లాక్‌డౌన్‌ గడువు ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 15 నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేయబోతున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇటీవల ఆయన ప్రధాని నరేంద్రమోడీని కలిసిన తరువాత ఈ ట్వీట్ చేయడంతో ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ ఎత్తివేయడం ఖాయంగానే కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ ఇదివరకులా ప్రజలు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరగడానికి అనుమతించరని, కొన్ని పరిమితులు, ఆంక్షలు కొనసాగవచ్చునని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మరికొంత కాలం దేశప్రజలందరూ  మరి కొంతకాలం సామాజికదూరం పాటించక తప్పదని ప్రేమ ఖండూ అన్నారు. ఇందుకు సంబందించిన మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ నుంచి మళ్ళీ రైళ్ళు, విమానయాన సేవలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. ఏప్రిల్ 15 నుంచి ప్రయాణాలు కావాలంటే ఇప్పటి నుంచే టికెట్ రిజర్వేషన్లను అనుమతించాల్సి ఉంటుంది కనుక రైల్వే, విమానయాన శాఖలు కూడా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చు. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చినట్లు కనబడింది కానీ నిజాముద్దీన్‌ మతసమావేశాలలో పాల్గొన్నవారి ద్వారా దేశంలో కరోనా కేసుల ఉదృతి మళ్ళీ పెరిగిపోయింది. కానీ కొత్తగా వ్యాపిస్తున్న ఈ కేసులను అరికట్టేందుకు ఇంకా 13 రోజులు సమయం ఉంది కనుక అప్పటికి పరిస్థితులు మెరుగైతే లాక్‌డౌన్‌ ఎత్తివేయవచ్చు.


Related Post