కరోనాపై పోరాటానికి రూ.2,429 కోట్లు విరాళాలు

April 01, 2020


img

ప్రస్తుతం యావత్ ప్రపంచదేశాలు కరోనా మహమ్మారి కారణంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనాను ఎదుర్కోవడం భారత్‌కు శక్తికి మించినదే అయినప్పటికీ వేరే మార్గం లేనందున పోరాడుతోంది. కరోనాపై పోరాటంలో అందరూ కలిసిరావలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుకు దేశంలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు సైతం ముందుకువచ్చి దీనికోసం ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్’ఖాతాకు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పీఎం కేర్స్’కు విరాళాలు ఇచ్చినవారి వివరాలు: 

సంస్థ పేరు

ఇచ్చిన విరాళం

టాటా

500 కోట్లు

రిలయన్స్

500 కోట్లు

ఓఎన్‌జీసీ  

300 కోట్లు

భారతీయ రైల్వేలు

151 కోట్లు

ఎల్&టి

150 కోట్లు

కేంద్ర సాయుధ బలగాలు

116 కోట్లు

అధానీ ఫౌండేషన్

100 కోట్లు

బజాజ్

100 కోట్లు

జెఎస్‌డబ్ల్యూ

100 కోట్లు

టోరెంట్

100 కోట్లు

వేదాంత రిసౌర్సస్

100 కోట్లు

మిత్తల్ నిప్పన్ గ్రూప్

100 కోట్లు

బీసీసీఐ

51 కోట్లు

పతంజలి

25 కోట్లు

అక్షయ్ కుమార్

25 కోట్లు

భూషణ్ కుమార్

11 కోట్లు

మొత్తం

2,429 కోట్లు


Related Post