తెలంగాణ ప్రభుత్వోద్యోగుల జీతాలలో కోత

March 31, 2020


img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో వివిదశాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం దాదాపు నిలిచిపోవడం, అదే సమయంలో కరోనా నివారణ కోసం భారీగా ఖర్చు చేయవలసివస్తుండటంతో ముఖ్యమంత్రి నుంచి క్లాస్-4 ఉద్యోగుల వరకు అందరికీ మార్చి నెల జీతాలలో కొంతమేర కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించారు. రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ చక్కబడిన తరువాత ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. ఉద్యోగులతోపాటు పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్నవారికి కూడా ఈ కోతలు అమలుచేయాలని నిర్ణయించారు.  

1. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలలో 75 శాతం కోత విదించబడుతుంది. 

2. ఐఏస్‌, ఐపీస్‌, ఐఏఎఫ్ అధికారులకు 60 శాతం కోత విదించబడుతుంది.

3. ప్రభుత్వోద్యోగులందరికీ 50 శాతం కోత విదించబడుతుంది.

4. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విదించబడుతుంది.

5. క్లాస్-4, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలలో 10 శాతం కోత విదించబడుతుంది.

6. క్లాస్-4 రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత విదించబడుతుంది.

7. ప్రభుత్వోద్యోగులకు ఏవిధంగా జీతాలలో కోతలు విధిస్తున్నారో అదేవిధంగా అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు కోతలు అమలుచేయబడతాయి. 

కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగించవలసివస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇంకా దిగజారే ప్రమాదం ఉంటుంది కనుక ముందుజాగ్రత్త చర్యగా ఈ కటిననిర్ణయం తీసుకోక తప్పడంలేదని ఆర్ధికశాఖ అధికారులు చెపుతున్నారు. రేపు 1వ తేదీన అందరికీ జీతాలు చెల్లించవలసి ఉంటుంది కనుక ఈరోజు సాయంత్రంలోగా ఈమేరకు అధికారిక నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.


Related Post