ఏప్రిల్ 14వరకు మెట్రో బంద్‌ పొడిగింపు

March 26, 2020


img

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో సేవలను కూడా ఏప్రిల్ 14వరకు నడిపించబోమని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం ప్రకటించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను బట్టి మళ్ళీ ఎప్పటి నుంచి మెట్రో సేవలను ప్రారంభిస్తామో తెలియజేస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. 

పౌరవిమానయాన సంస్థ కూడా ఏప్రిల్ 14వరకు అంతర్జాతీయ విమానసేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు దేశంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది కనుక రైల్వే, ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా అప్పటివరకూ తిరిగే అవకాశం ఉండదు. Related Post