ఆ బాలికకు మెలానియా స్పెషల్ హగ్

February 25, 2020


img

అమెరికా ప్రధమమహిళ మెలానియా ట్రంప్ ఈరోజు మధ్యాహ్నం డిల్లీలోని సర్వోదయ కో-ఎడ్ సెకండరీ స్కూలుకు వెళ్ళి సుమారు 20 నిమిషాలు విధ్యార్ధులతో గడిపారు. ఆమె స్కూలుకు వచ్చినప్పుడు చిన్నారులు భారత్‌, అమెరికా జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆమెకు నుదుటబొట్టు పెట్టి హారతి ఇచ్చి చిన్నారులు స్వాగతం పలికారు.


తరువాత ఆమె ఓ తరగతిగదిలోకి వెళ్ళి అక్కడి పిల్లలకు ఉపాద్యాయులు పాఠాలు భోదించే విధానం గమనించారు. అనంతరం కొందరు విద్యార్ధులు తాము గీసిన బొమ్మలను చూపించారు. విద్యార్ధులు పూలదండలు పట్టుకొని ఆమె దగ్గరకురాగా ఆమె వంగి చాలా సంతోషంగా వాటిని మెడలో వేయించుకొన్నారు.


ఆమె తిరిగి వెళుతుండగా దారికిరువైపులా వరుసగా కూర్చోన విద్యార్దులు ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా, ఆమె ఏమాత్రం విసుక్కోకుండా వారిదగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ప్రయత్నంలో పిల్లలు ఆమె చెయ్యి పట్టుకొనేందుకు పోటీ పడగా ఆమె తూలిపడబోయారు కానీ నిలదొక్కుకున్నారు. ఆమె వారిలో ఒక అమ్మాయిని దగ్గరకు పిలిచి ప్రేమగా కౌగలించుకొన్నారు. అది చూసి విద్యార్ధులు అందరూ పెద్దగా అరుస్తూ హర్షధ్వానాలు పలికారు. మెలానియా ట్రంప్ పాఠశాలలో సుమారు 20 నిమిషాలు చాలా హాయిగా గడిపారు.




Related Post