మంత్రి సబితారెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

January 11, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల అక్రమాస్తుల కేసులలో పెన్నా సిమెంట్స్ కేసు కూడా ఒకటి. దానిపై సిబిఐ ఈరోజు ఒక అనుబంద ఛార్జీషీట్‌ను సిబిఐ కోర్టులో దాఖలు చేసింది. దానిని విచారణకు స్వీకరించిన సిబిఐ కోర్టు, ఆ కేసులో నిందితులైన తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీనియర్ ఐఏస్‌ అధికారులు శ్రీలక్ష్మి, విడి.రాజగోపాల్, డీఆర్‌ఓ సుదర్శన్, తహశీల్దార్ ఎల్లమ్మలకు ఈనెల 17న కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. 

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరుగబోతున్న ఈ సమయంలో మంత్రి సబితా రెడ్డికి అక్రమాస్తుల కేసులో విచారణకు కోర్టుకు హాజరుకావాలంటూ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడం ఆమెకు, తెరాసకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీలు ఈ అంశాన్ని ఎన్నికలలో ఆయుధంగా ఉపయోగించుకొంటే ఇంకా ఇబ్బందికరమే. Related Post