అయోధ్య రామమందిరానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్

December 12, 2019


img

అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై దశాబ్ధాలుగా కేసులు, ఎన్నికల రాజకీయాలు నడిచిన తరువాత వాటన్నిటికీ గతనెలలో సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయోధ్యలో వివాదాస్పద 2.3 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని తుది తీర్పు చెప్పింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 18 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రదానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వాటన్నిటిపై ఒకేసారి విచారణకు చేపట్టి, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత 18 రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు గురువారం తీర్పు చెప్పింది. దీంతో అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చివరి అవరోధం కూడా తొలగిపోయినట్లయింది. 

ఈ తీర్పును ప్రధాని నరేంద్రమోడీ స్వాగతిస్తూ, “గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సున్నితమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాలక్షేపం చేసింది. కానీ మా ప్రభుత్వం ఒక్కో సమస్యను శాస్విత ప్రతిపదికన పరిష్కరించుకొంటూ ముందుకు సాగుతోంది. వీలైనంత త్వరగా అయోద్యలో రామమందిరం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాము,” అని అన్నారు. 


Related Post