ప్రియాంకా రెడ్డి హత్యపై జీవన్ రెడ్డి స్పందన

November 30, 2019


img

ప్రియాంకా రెడ్డి హత్యకేసుపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ, “ప్రియాంకా రెడ్డి హత్య కేసులో సిఎం కేసీఆర్‌ మొదలు సిపి సజ్జనార్ వరకు అందరూ బాధ్యతారహితంగానే వ్యవహరిస్తున్నారు. తన పాలనలో ఎవరైనా మహిళల వైపు కన్నెత్తి చూసినా వారి గుడ్లు పీకేస్తానని రంకెలు వేసిన సిఎం కేసీఆర్‌ నగర శివార్లలో డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య చేయబడితే ఇంతవరకు ఎందుకు స్పందించడంలేదు? సిఎం కేసీఆర్‌ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగానే చూస్తుండటం వలననే ఇటువంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ప్రియాంకా రెడ్డి తల్లితండ్రులను ఓదార్చడానికి వెళ్ళిన మంత్రి సబితా రెడ్డి, వారి బిడ్డ పోలీసులకు ఫోన్‌ చేయలేదంటూ ప్రియాంకా రెడ్డినే తప్పు పడుతున్నట్లు మాట్లాడటం చాలా బాధాకరం. ఆమె తల్లితండ్రులు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళితే పోలీసులు వారిపట్ల అవమానకరంగా మాట్లాడటం, వెంటనే స్పందించకపోవడం ఒక తప్పయితే పోలీస్ కమీషనర్ సజ్జనార్ వారిని వెనకేసుకువస్తూ మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. ఇంత జరుగుతున్నా సిఎం కేసీఆర్‌ స్పందించక పోవడం చాలా బాధాకరం,” అని అన్నారు.


Related Post