ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏమి తెలుసు?

November 16, 2019


img

టిఎస్ ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ శనివారం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌పై ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సునీల్ శర్మ ఆర్టీసీలోకి వచ్చి 17 నెలలు అయినప్పటికీ 6-7 సార్లు మాత్రమే తన కార్యాలయానికి వచ్చారు. కనుక ఆర్టీసీ గురించి ఆయనకు ఏమి తెలుసని అఫిడవిట్‌ సమర్పించారు. సిఎం కేసీఆర్‌ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి, దానిని తీసుకువచ్చి ఆర్టీసీ యాజమాన్యం తరపున హైకోర్టు సమర్పిస్తుంటారు. అది సిఎం కేసీఆర్‌ తయారు చేయించిన రాజకీయ అఫిడవిట్‌ తప్ప సిసలైన అఫిడవిట్‌ కాదు. ఆర్టీసీ పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడే నష్టాలు వస్తున్నాయని పదేపదే చెప్పిన ఆయన ఇప్పుడు సమ్మె వలననే  ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. సమ్మె చట్ట విరుద్దమో కాదో రేపు కోర్టే తెలుస్తుంది. హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్య వైఖరిలో మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం,” అని అన్నారు. Related Post