రేపు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం

September 20, 2019


img

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ శనివారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించడానికి రెండు రాష్ట్రాల భాగస్వామ్యంతో నిర్మించదలచుకున్నఎత్తిపోతల పధకం గురించి వారు ఈసమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల సాగునీటిశాఖ అధికారులు, ఇంజనీర్లు రెండుమూడు సార్లు సమావేశమై ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల గురించి లోతుగా చర్చించారు. కనుక రేపటి సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదికాక చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై కూడా వారు చర్చించవచ్చునని సమాచారం. Related Post