కాంగ్రెస్‌కు ఊర్మిళ గుడ్ బై!

September 10, 2019


img

ఊర్మిళా మటోండ్కర్ పరిచయం అక్కరలేని వ్యక్తి. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో ఆమె చేసిన నృత్యాలు నేటికీ చాలా హాట్‌హాట్‌గానే ఉన్నాయి. ఆమె లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తర ముంబై నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. అప్పుడే రాజకీయాల నుంచి తప్పుకొంటారని ఊహాగానాలు వినిపించాయి కానీ వాటిని ఆమె ఖండిస్తూ వచ్చారు. కానీ ఈరోజు వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను దేశసేవ చేయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరితే, ఆ పార్టీలో అంతర్గతం కుమ్ములాటలు చూసి విసుగెత్తిపోయి రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. మళ్ళీ వేరే పార్టీలో చేరుతారా లేదా? అనే విలేఖరుల ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. Related Post