తెరాస సర్కారుకు సుప్రీంకోర్టు తాజా ఆదేశం

July 19, 2019


img

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అనర్హతవెతుకు గురైన తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్, హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ సుప్రీంకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. ఆయన అనర్హత కేసుపై తుది తీర్పు వెలువరిచే వరకు ఎన్నికలు జరిపించవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, మండలి ఛైర్మన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు పంపి ఈ కేసుపై కౌంటరు దాఖలు చేయాలని కోరింది. అయితే పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై స్పీకరు లేదా మండలి ఛైర్మన్లకు రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటు వేసే అధికారం ఉంటుంది. ఇదే విషయం హైకోర్టు స్పష్టం చేసి రాములు నాయక్, యాదవ్ రెడ్డిల కేసును కొట్టివేసింది. కనుక సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించవచ్చు. 



Related Post