టిక్ టాక్‌ ఉద్యోగులకు జీతాలు కట్

July 18, 2019


img

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో పనిచేస్తున్న 11 మంది తాత్కాలిక ఉద్యోగులు, మూడు రోజుల క్రితం ఆఫీసు పనివేళలలో టిక్ టాక్ వీడియోలు చిత్రీకరించి వాటిని అప్ లోడ్ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వాటిపై స్పందించిన మున్సిపల్ కమీషనర్ జె శ్రీనివాసరావు ఆ 11 మంది ఉద్యోగులకు 10 రోజుల జీతం కోత విధించడంతో పాటు అందరినీ వేరే సెక్షన్లకు బదిలీ చేశారు. మళ్ళీ ఎప్పుడైనా కార్యాలయంలో ఈవిధంగా బాధ్యతారహితంగా వ్యవహరించితే కటినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.     Related Post