కిషన్‌రెడ్డి కార్యాలయానికి ఆమ్రపాలి బదిలీ

July 12, 2019


img

గతంలో వరంగల్ జిల్లా కలెక్టరుగా మంచి పేరు, ప్రజాధారణ సంపాదించుకున్న ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో అడిషనల్ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. మంచి సమర్దుడని పేరు తెచ్చుకున్న మరో ఐఏఎస్ అధికారి కె.శశికిరణాచారి కూడా జీహెచ్‌ఎంసీలోనే చేస్తున్నారు. వారిరువురినీ తక్షణమే కేంద్రసర్వీసులలోకి పంపించవలసిందిగా కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వారిరువురినీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. ఆమ్రపాలిని ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీ), శశికిరణాచారిని అడిషనల్ పీఎస్ (పర్సనల్ సెక్రెటరీ)గా నియమితులయ్యారు. ఈ బదిలీలు కేవలం యాదృచ్చికంగా జరిగినవేనా లేక రాష్ట్రంలో బిజెపి ప్రయోజనాల కోసం జరిగినవా అనేది తెలియాల్సిఉంది. Related Post