వరంగల్‌లో దారుణం

June 19, 2019


img

వరంగల్‌ జిల్లాలో చాలా దారుణమైన సంఘటన జరిగింది. ప్రవీణ్ అనే వ్యక్తి తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఆ పాప మరణించింది. హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న పసిపాపను ప్రవీణ్ క్రిందకు తీసుకుపోయి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే పాప ఏడుపు వినిపించిన తల్లితండ్రులు మేల్కొని అక్కడకు చేరుకునేసరికి అతను పాపను వదిలి పారిపోబోయే ప్రయత్నం చేయబోతే వారు అతనిని పట్టుకొని బందించి, పాపను హుటాహుటిన హన్మకొండలోని మ్యాక్స్ కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ తీవ్రంగా గాయపడిన ఆ పసిపాప చనిపోయింది. స్థానికులు ప్రవీణ్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Related Post