సిఎం కేసీఆర్‌ నేటి కార్యక్రమాలు

June 17, 2019


img

సిఎం కేసీఆర్‌ ఈరోజంతా బిజీబిజీగా గడపానున్నారు. హైదర్‌గూడాలో ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌ను సిఎం కేసీఆర్‌ ఈరోజూ ఉదయం 11.40 గంటలకు ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకొని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం విజయవాడలో భోజన విరామం తరువాత 1.45 కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మారంగలో తాడేపల్లికి వెళ్ళి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడలో ఒక శుభకార్యక్రమంలో పాల్గొని రాత్రి 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆహ్వానిస్తారో లేదో ఇంకా తెలియవలసి ఉంది. Related Post