తాజా వార్తలు

May 27, 2019


img

ప్రధాని నరేంద్రమోడీతో జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురూ ఏపీకి సబందించిన సమస్యలపై చర్చించారు. ఏపీకి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోడీ జగన్‌కు హామీ ఇచ్చారు.

నేడు సిఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్నారు. 

ఈనెల 29న నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా భువనేశ్వర్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెడి మళ్ళీ ఘనవిజయం సాధించడంతో ఆయన వరుసగా 5వసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టనున్నారు. 

ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆరోజు తానొక్కడినే ప్రమాణస్వీకారం చేస్తానని ఆ తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేసుకొంటానని చెప్పారు. ఆ కార్యక్రమానికి తెలంగాణ సిఎం కేసీఆర్‌ హాజరుకాబోతున్నారు. 

ఈనెల 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి భవన్‌ గురువారం ప్రకటించింది. 

జూన్ 5నుంచి జూన్ 15వరకు పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. మొదట లోక్‌సభ స్పీకర్, డెప్యూటీ స్పీకర్లను ఎన్నుకొంటారు. ఈ సమావేశాలలోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


Related Post