కొండను డ్డీకొన్న రంజిత్ రెడ్డి...గెలిచారు

May 23, 2019


img

అపార రాజకీయ అనుభవజ్ఞుడు, చేవెళ్ళ నియోజకవర్గంలో అపారమైన ప్రజాధారణ కలిగి ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని డ్డీ కొనడమంటే నిజంగా కొండను డ్డీ కొనడమేనని చెప్పవచ్చు. ఆయన చాలా సునాయాసంగానే గెలుస్తారని అందరూ భావించారు. చివరి నిమిషం వరకు ఆయనే ఆధిక్యతలో కొనసాగారు కూడా. కానీ అంతిమంగా తెరాస అభ్యర్ధి డాక్టర్ రంజిత్ రెడ్డి కొండాపై 14,400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దాంతో 8 సీట్లకే పరిమితం అవుతుందనుకొన్న తెరాసకు మరో సీటు అధనంగా దక్కింది. ఈ ఓటమి కొండాకు...కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. కొండా కూడా గెలిచి ఉండి ఉంటే రాష్ట్ర కాంగ్రెస్‌ మళ్ళీ గర్వంగా తలెత్తుకొని నిలబడగలిగేది. నల్గొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటనిస్తోంది. కానీ వారు ముగ్గురూ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పు కొన్నట్లయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉండవచ్చు. 


Related Post