టీవీ9 రవిప్రకాశ్‌కు మళ్ళీ నోటీసులు

May 14, 2019


img

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ను విచారించడానికి పోలీసులు మళ్ళీ నిన్న మరోసారి నోటీసు పంపించారు. మే 15వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావలసిందిగా కోరుతూ నోటీస్ పంపారు. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియా ఫిర్యాదు మేరకు ఫోర్జరీ కేసులో పోలీసులు రవిప్రకాశ్‌కు ఈనెల 9, 11 తేదీలలో విచారణకు హాజరు కావలసిందిగా కోరుతూ రెండుసార్లు నోటీసులు పంపించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. తనకు 10 రోజులు సమయం కావాలని రవిప్రకాశ్‌ కోరారు. అందుకు అంగీకరించని పోలీసులు ఈసారి సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు జారీ చేసారు. ఒకవేళ ఆయన 15న కూడా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేసేందుకు వీలుగా సెక్షన్ 41 కింద నోటీస్ జారీ చేసినట్లు తెలుస్తోంది. టీవీ9 నుంచి బయటకు వచ్చిన తరువాత రవిప్రకాశ్‌ ఒక్కసారి మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు సమాచారం. Related Post