బిజెపి లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

March 22, 2019


img

లోక్‌సభ ఎన్నికలకు బిజెపి గురువారం రాత్రి 183 మంది అభ్యర్ధులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ తాను ప్రాతినిద్యం వహిస్తున్న వారణాసి నుంచే పోటీ చేయబోతున్నారు. అయితే గతంలోలాగే ఈసారి కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా లేక ఒకే చోట నుంచి పోటీ చేస్తారా లేక? అనే విషయం తుది జాబితా విడుదలైతే కానీ తెలియదు. 

ఈసారి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దానికి బిజెపి వ్యవస్థాపకుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక బిజెపి ఆయనను పక్కనపెట్టినట్లు భావించవచ్చు. ఆయనతో పాటు 22 సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టింది. 

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి ముఖ్యనేతలలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ (యూపీలోని లక్నో), నితిన్ గడ్కారీ (మహారాష్ట్రలోని నాగపూర్), స్మృతీ ఇరానీ (యూపీలోని అమేదీ), కిషన్ రెడ్డి-సికిందరాబాద్‌, పురందేశ్వరి-విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నారు. 

తెలంగాణ బిజెపి లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా:

1. సికిందరాబాద్‌: కిషన్ రెడ్డి. 

2. మల్కాజ్‌గిరి: రామచంద్రరావు

3. కరీంనగర్‌: బండి సంజయ్

4. మహబూబ్‌నగర్‌: డికె అరుణ 

5. నిజామాబాద్‌: అరవింద్ 

6. వరంగల్: చింతా సాంబమూర్తి

7. మహబూబాబాద్: జాటోతు హుస్సేన్‌ నాయక్‌

8. భువనగిరి: శ్యామ్ సుందర్ రావు

9. నల్గొండ: గార్లపాటి జితేందర్‌ రెడ్డి

10. నాగర్ కర్నూల్: బంగారు శృతి



Related Post