టి-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు విప్

March 12, 2019


img

నేడు జరుగనున్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్‌ బహిష్కరించినందున, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరూ పోలింగులో పాల్గొనరాదని ఎవరికీ ఓట్లు వేయరాదని అందరూ గైర్హాజరు కావాలని ఆదేశిస్తూ    కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం విప్ జారీ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరైనా ఓటింగులో పాల్గొని తెరాస అభ్యర్ధులకు ఓట్లు వేసినట్లయితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. కానీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య ముగ్గురూ తెరాసలో చేరబోతున్నామని ప్రకటించినందున వారు ముగ్గురూ పార్టీ విప్ ను ధిక్కరించి తెరాస అభ్యర్ధులకు ఓట్లు వేయడం ఖాయమేనని భావించవచ్చు. సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా తెరాసలో చేరేందుకు సిద్దం అయ్యారు కనుక వారితోపాటు ఆయన కూడా ఓటింగులో పాల్గొనవచ్చు. Related Post