తెలంగాణకు రూ.500 కోట్లు మంజూరు

February 18, 2019


img

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పధకం కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.500 కోట్లు లభించనున్నాయి. ఆ పధకంలో లబ్దిదారుల ఎంపికకు కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 25లక్షలమంది రైతులు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి వివరాలను కేంద్రానికి సమర్పించింది. వారిలో ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.6,000 చొప్పున చెల్లించబోతోంది. ఆ సొమ్మును ఒకేసారి కాకుండా 3 వాయిదాలలో వారి బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమా చేయబోతోంది. 

దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పధకం కింద అర్హులైన రైతులలో ఒక్కొక్కరికీ ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున లభించబోతోంది. అంటే 1-5 ఎకరాలలోపు పొలం కలిగి, రెండు పధకాలకు అర్హులైన రైతులకు ఏడాదికి కనీసం రూ.16,000-56,000 వరకు అందుకోబోతున్నారన్నమాట. ఈనెల 24న  ప్రధాని నరేంద్రమోడీ కిసాన్ సమ్మన్ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజునే దేశవ్యాప్తంగా వీలైనంతమంది ఎక్కువ మంది రైతుల ఖాతాలలో మొదటివిడత సొమ్మును జమా చేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. 


Related Post