నల్గొండవాసులకు శుభవార్త

February 12, 2019


img

నల్గొండవాసులకు ఓ శుభవార్త. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిఎం కేసీఆర్‌ నల్గొండలో ప్రచారానికి వచ్చినప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలో నల్గొండను దత్తత తీసుకొని రూ.500 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తారని తెరాస ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. 

నల్గొండ పట్టణంలో రోడ్లు, మంచినీళ్ళు, మురుగుకాలువలు వంటి ఎటువంటి సమస్యలున్నా తనకు తెలియజేయాలని కోరారు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం పూర్తికాగానే సంబందిత మంత్రి ద్వారా నల్గొండ పట్టణం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతామని భూపాల్ రెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ దశాబ్ధాలుగా అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, కానీ తెరాస కేవలం నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపింది కనుకనే అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారని అన్నారు. త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘోరపరాజయం తప్పదని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.


Related Post