శ్రీ జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శనం

February 11, 2019


img

వసంత పంచమి సందర్భంగా ఆదివారం రాష్ట్రంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో కూడా నిన్న వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం వెయ్యిఘటాలలో తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆనవాయితీ ప్రకారం అభిషేకాల తరువాత అమ్మవారి నిజరూపదర్శనం లభించింది. గత 5 రోజులుగా బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగియడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీహోమం నిర్వహించి పూర్ణాహుతితో స్వస్తి పలికారు. మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డికె అరుణ, ఆలంపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ రాధిక, స్థానిక ఎమ్మెల్యే  తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.      Related Post