ఫిరాయింపులపై తెరాసది ద్వందవైఖరి: చాడా

January 17, 2019


img

రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు సాధారణమైన విషయమే కానీ ఫిరాయించినవారు తమ తమ పార్టీల ద్వారా పొందిన శాసనసభ, మండలి, లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. వారు అధికార పార్టీలో చేరితే వారిపై ఆయా పార్టీలు ఎన్ని పిర్యాదులు ఇచ్చినా స్పీకర్, మండలి ఛైర్మన్ పట్టించుకోరు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరు. చివరికి గవర్నరు కూడా పట్టించుకోరు. అదే...అధికార పార్టీకి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలో చేరితే వారిపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకొంటారు. ఇటీవల తెరాసకు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, రాములు నాయక్, భూపతి రెడ్డిల విషయంలో కూడా ఇలాగే జరిగింది. వారిపై తెరాస నుంచి ఫిర్యాదు అందగానే మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ విచారణ చేపట్టి అనర్హత వేటు వేశారు. 

దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరమణ స్పందిస్తూ, “పార్టీ ఫిరాయింపులను నిరోదించేందుకు చట్టం ఉన్నప్పటికీ తెరాస దానిని తనకు నచ్చినట్లు అన్వయించుకొంటూ ఆ చట్టం యొక్క ఉద్దేశ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. తెరాస ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయిస్తే నెలరోజులలోనే వారిపై చర్యలు తీసుకున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని నాలుగేళ్ళయినా చర్యలు తీసుకోకుండా కాలక్షేపం చేసిన మాట వాస్తవమా కాదా? ఫిరాయింపుల విషయంలో తెరాస ద్వంద వైఖరి అవలంభిస్తోంది,” అని విమర్శించారు. 


Related Post