తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ

January 12, 2019


img

జనవరి 1వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు విడిపోయి వేర్వేరుగా పనిచేయడం ఆరంభించాయి. అప్పుడే హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. అంటే ఇంకా రెండు వారాలు కూడా కాలేదన్నమాట! ఇంతలోనే ఆయనను కోల్‌కతా హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతా హైకోర్టు ప్రధానన్యాయమూర్తి డిసెంబరు 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ను కోల్‌కతాకు బదిలీ చేశారు. కనుక ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులవుతారో చూడాలి. Related Post