రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు

December 15, 2018


img

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇదివరకు 10 జిల్లాలను 31 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తున్నప్పుడే ములుగు, నారాయనపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని స్థానిక నేతలు, ప్రజలు పట్టుబట్టారు. కానీ వివిదకారణాల చేత ఏర్పాటు చేయలేకపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు మళ్ళీ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ములుగు, నారాయణ పేట జిల్లాలను ఏర్పాటు చేస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం వాటిని జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాట్లు చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ తదితరులు శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యి చర్చించారు. వీటితో పాటు రాష్ట్రంలో మరో 5 రెవెన్యూ డివిజన్లు, 7 కొత్త మండలాలను కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు.


Related Post