వేణు మాధవ్ నామినేషన్ దాఖలు

November 19, 2018


img

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కోదాడ తహసిల్ధార్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఆయన నామినేషన్ వేసేందుకు ప్రయత్నించినప్పుడు దానితో కొన్ని దృవీకరణ పత్రాలను జత చేయకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆయన దరఖాస్తును తిరస్కరించారు. ఈరోజు అన్ని పత్రాలతో నామినేషన్ దాఖలు చేశారు. వేణు మాధవ్ కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. రేపటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. 

కోదాడ నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి, తెరాస అభ్యర్ధిగా బొల్లం యాదవ్, బిజెపి అభ్యర్ధిగా జె వెంకటేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. Related Post