హమ్మయ్య! టిజేఎస్ మొదటి జాబితా వెలువడింది

November 17, 2018


img

ఆరు నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుంది తెలంగాణ జనసమితి పని. మొదట 119 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిన ఆ పార్టీ అధినేత చివరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 8 సీట్లతో సర్దుకుపోయారు. ఆ 8 సీట్ల కోసమే రెండు నెలలపాటు కాంగ్రెస్‌ నేతలతో చర్చోపచర్చలు జరిపి పలుమార్లు డిల్లీ వెళ్ళివచ్చారు. ఇంత సుదీర్గంగా కసరత్తు చేసినా ఒకేసారి 8 స్థానాలకు తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటించలేకపోయారు. అదే...119 స్థానాలకు పోటీ చేసి ఉంటే ఏమి చేసేవారో తెలియదు. శనివారం సాయంత్రం నలుగురు అభ్యర్ధుల పేర్లను టిజేఎస్ అధికారికంగా ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను రేపు ప్రకటిస్తామని ఆ పార్టీ ప్రతినిధి తెలిపారు. 

టిజేఎస్ అభ్యర్ధుల వివరాలు: 

1.మెదక్‌- జనార్దన్‌రెడ్డి, 2. మల్కాజ్‌గిరి: కపిలవాయి దిలీప్‌కుమార్‌, 3.సిద్దిపేట: భవానీరెడ్డి, 4.దుబ్బాక: రాజ్‌కుమార్‌


Related Post