వేణూ...ఇదేం కామెడీ?

November 16, 2018


img

ప్రముఖ హాస్య నటుడు వేణూ మాధవ్ కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఇవాళ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి కోదాడ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళగా దరఖాస్తులో పేర్కొన్న వివరాలకు సంబందించిన దృవీకరణ పత్రాలను జత చేయకపోవడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ఇక చేసేదేమీ వెనుతిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు లేదా ఎల్లుండి అన్ని దృవీకరణ పత్రాలతో నామినేషన్ వేస్తానని చెప్పారు. 



Related Post