పూర్తి మేనిఫెస్టో విడుదలైతే....కడియం శ్రీహరి

October 19, 2018


img

కాంగ్రెస్ పార్టీ చెపుతున్న నిరుద్యోగభృతి, ఒకేసారి పంట రుణాల మాఫీ, పెన్షన్ల పెంపు వంటివన్నీ సిఎం కేసీఆర్‌ కాపీ కొట్టి తమ మేనిఫెస్టోలో పెట్టుకొన్నారని, ఓటమి భయంతోనే తమ మనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు తమ మేనిఫెస్టోను ప్రకటించనే లేదు. మరి దానిని మేము కాపీ కొట్టామని ఎలా చెప్పుతున్నారు? మా మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలు బయటపెడితేనే కాంగ్రెస్‌ నేతలు భయంతో వణికిపోతున్నారు. ఇక పూర్తి మేనిఫెస్టోను చూస్తే ఇక ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా సాహసించరేమో? దమ్ముంటే మాకంటే మంచి మేనిఫెస్టోను రూపొందించి చూపాలని కాంగ్రెస్‌ నేతలకు నేను సవాలు చేస్తున్నాను. 

కాంగ్రెస్‌ నేతలకు ఓటమి భయంతోనే నోటికి వచ్చినట్లు మాపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నారు. గత నాలుగున్నరేళ్లలో మా ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం వేలకోట్లు ఖర్చుపెట్టింది. ఇకముందు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడదు. ఇప్పటి వరకు అమలుచేస్తున్నవి, సిఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన కొత్త పధకాల అమలుకు ఏడాదికి సుమారు రూ.48-60,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాము. అంత ఆర్ధికభారం భరించగలమని భావించినందునే హామీలు ఇచ్చాము తప్ప ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి గెలవాలని కాదు. అధికారంలోకి వస్తే ఆ హామీలను ఖచ్చితంగా అమలుచేసి చూపిస్తాము,” అని అన్నారు.


Related Post