రాష్ట్రంలో మరో కొత్తపార్టీ

October 16, 2018


img

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు కొత్త కొత్త రాజకీయపార్టీలు పుట్టుకురావడం సహజమే. రాష్ట్రంలో యునైటెడ్‌ ఇండియా పార్టీ అనే ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది. దానికి రాజేష్ అనే వ్యక్తి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన పార్టీ నేతలతో కలిసి సోమవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తమ పార్టీ కార్యాచరణ ప్రణాళిక, పార్టీ ఆశయాల గురించి వివరించారు.

“రాబోయే ఎన్నికలలో మొత్తం 119 స్థానాలకు మా పార్టీ పోటీ చేస్తుంది. వాటిలో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తాము. మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తెస్తాము. రాష్ట్రంలో 60 సం.లు వయసు దాటిన వారందరికీ నెలకు రూ.2000 చొప్పున పెన్షన్ అందజేస్తాము. 12 సం.ల వయసులోపు బాలలందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తాము. ప్రతీగ్రామంలో ఒక హెల్త్ కేర్ సెంటర్, ప్రతీ నియోజకవర్గంలో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాము. రాష్ట్రంలో మరో 5 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తాము. రాష్ట్రంలో హైదారాబాద్ కు ధీటుగా మరో నాలుగు నగరాలను అభివృద్ధి చేస్తాము. బడుగు బలహీనవర్గాలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే మా పార్టీ ప్రధాన అజెండా,” అని వివరించారు రాజేష్.    



Related Post