రైతుల ఖాతాలలోకి త్వరలో నగదు బదిలీ

October 16, 2018


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం మొదటి విడత చెక్కుల పంపిణీ సాఫీగానే సాగిపోయినప్పటికీ రెండవ విడత చెక్కుల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. రైతుబంధు పధకం కొనసాగించవచ్చని కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసారి రైతులకు చెక్కుల రూపంలో కాక నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలోకి నగదు బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కనుక గతంలో రైతుబంధు లబ్దిదారులు అందరి బ్యాంక్ ఖాతాలలోకి ఈనెల 22 నుంచి రెండవ విడత పంట పెట్టుబడి సొమ్మును బదిలీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. Related Post