మైలు రాళ్ళలో జీరోరాయి ఎక్కడ ఉందో తెలుసా?

October 15, 2018


img

మనం ఒక ఊరు నుంచి మరో ఊరుకు వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన వరుసగా మైలు రాళ్ళు కనిపిస్తుంటాయి. మనం ఉన్న ఆ ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న ఊరికి ఎంత దూరం ఉందో వాటి ద్వారా తెలుసుకొంటాము. ఈ మైలు రాళ్ళను బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1907లో ఏర్పాటు చేశారు. మనదేశంలో ‘జీరో పాయింట్’ మైలు రాయిని మహారాష్ట్రలో నాగపూర్‌లో ఏర్పాటు చేశారు. దానినే నేటికీ ‘రిఫరెన్స్ పాయింటు మైలురాయిగా ఉపయోగిస్తున్నారు. అక్కడి నుంచి హైదారాబాద్(485కిమీ), చెన్నై (1,117కిమీ), బెంగళూరు (1,062కిమీ), ముంబై(809కిమీ), డిల్లీ(1,029కిమీ), కోల్ కతా(1,118కిమీ), అహ్మదాబాద్ (851 కిమీ), కన్యాకుమారి(1,700కిమీ) దూరంలో ఉన్నాయి. ఆ జీరో మైలు రాయి సమీపంలోనే నాలుగు దిక్కులను సూచిస్తున్నట్లుగా నాలుగు గుర్రపు బొమ్మలున్న ఒక స్తంభాన్ని కూడా బ్రిటిష్ పాలకులు నిర్మించారు.

Related Post