కేసీఆర్‌ నన్ను నడిరోడ్డున వదిలేశారు: బాబూ మోహన్

October 11, 2018


img

సిట్టింగ్ ఎమ్మెల్యేలు లందరికీ టికెట్లు ఇస్తానని మాట ఇచ్చిన సిఎం కెసిఆర్ తనను మోసం చేశారని తెరాస మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ అన్నారు. తనను రాజకీయాలలోకి తెచ్చిన కేసీఆర్‌ నే నమ్ముకొని ఆయన బాటలోనే నడిచినందుకు చివరికి తనను నడిరోడ్డున నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాసకు, సిఎం కెసిఆర్ కు విధేయంగా పనిచేసినందుకు కేసీఆర్‌ ఇచ్చిన బహుమానం ఇదని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేనయిన తనకు కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా స్థానికత పేరుతో వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి కేసీఆర్‌ తనను ఘోరంగా అవమానించారని బాబూ మోహన్ కంట తడి పెట్టారు. సిఎం కెసిఆర్ తనను నడిరోడ్డులో విడిచిపెట్టి పోతే బిజెపి సాధారంగా ఆహ్వానించడంతో ఆ పార్టీలో చేరానని చెప్పారు. ఈసారి బిజెపి టికెట్ పై ఆంధోల్ నుంచే మళ్ళీ పోటీ చేసి తెరాస అభ్యర్ధిని ఓడించి ప్రతీకారం తీర్చుకొంటానని బాబూ మోహన్ చెప్పారు. Related Post