ప్రణయ్ హత్య కేసులో రాజకీయనేతల హస్తం?

September 17, 2018


img

మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం ముగిసాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ హత్యకు ప్రధానకారకుడు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రావణ్ లతో పాటు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీం మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రణయ్ ను హత్య చేసి పారిపోయిన హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చనిపోయిన ప్రణయ్ కుమార్ భార్య అమృతవర్షిణి టిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో సహా మరికొందరు నేతలపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ సంఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “ప్రణయ్ హత్య నన్ను షాక్‌కు గురిచేసింది. ఈరోజుల్లో కూడా కులం పిచ్చితో ఇటువంటి దారుణాలు జరుగుతుండటం చూస్తుంటే నాకు చాలా కోపం వస్తోంది. ఈ దారుణానికి ఎవరు కారకులైనా వారికి తప్పకుండా చట్టప్రకారం శిక్షపడుతుంది. న్యాయం గెలుస్తుంది. ప్రన్య భార్య, తల్లితండ్రులు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడసానుభూతి తెలియజేస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. 


Related Post