టిడిపితో పొత్తులు అవసరమా: కోమటిరెడ్డి

September 13, 2018


img

టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టిడిపితో పొత్తులకు సై అని దానితో సీట్లసర్ధుబాట్లపై చర్చలు జరుపుతుంటే, ఊహించినట్లుగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టిడిపితో పొత్తులను వ్యతిరేకించారు. తెలంగాణాలో అసలు ఓటు బ్యాంకే లేని టిడిపితో పొత్తులు మనకు అవసరమా? దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఏమి ప్రయోజనం? ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఘనవిజయం సాధించగల స్థితిలో ఉంది. కనుక టిడిపితో పొత్తుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒకసారి పునరాలోచించుకోవలసిందిగా కోరుతున్నాను. ఇదే విషయమై రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు నేను డిల్లీ వెళుతున్నాను. ఆయనకు రాష్ట్రంలో పార్టీల పరిస్థితి, బలాబలాల గురించి వివరిస్తాను,” అని చెప్పారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మంది సీనియర్ నేతలు టిడిపితో పొత్తులను వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇంతవరకు విజయశాంతి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్ప ఎవరూ బహిరంగంగా అభ్యంతరం చెప్పలేదు. పైగా టిడిపితో పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీకి చాలా బలమున్న, కీలకమైన సీట్లను వదులుకోవలసి ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి పోటీ చేయాలని ఎదురుచూస్తున్న వారు త్యాగాలు చేయవలసి ఉంటుంది కనుక టిడిపితో పొత్తులకు సిద్దపడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టడం ఖాయమనే చెప్పవచ్చు. 


Related Post