శామీర్‌పేట చెరువుకు మహర్దశ

August 17, 2018


img

రాజధాని హైదరాబాద్‌ నగరానికి కేవలం 23 కిమీ దూరంలో ఉన్న శామీర్‌పేట చెరువుకు మహర్దశ పట్టింది. నిజాం నవాబుల కాలంలో నిర్మించబడిన శామీర్‌పేట చెరువును చిరకాలంగా పాలకులు పట్టించుకోకపోవడంతో ఆసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే ఆ ప్రాంతంలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. 

తెలంగాణా పర్యాటకశాఖ శామీర్‌పేట చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించింది. జేసిబి యంత్రాలను పెట్టి ఆ ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్త చెదారాన్ని తొలగించి కట్ట మైసమ్మ ఆలయం వద్ద నుంచి రాజీవ్ రహదారి పొడవునా చెరువుకట్ట పక్కన వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాలలో ఎర్రమట్టి పరిచి దానిపై కార్పెట్ గ్రాస్(గడ్డి)ని పరుస్తున్నారు. మద్యలో అందమైన పూల మొక్కలు నాటుతున్నారు. గతవారం రోజులుగా జరుగుతున్న సుందరీకరణ పనులతో ఆ ప్రాంతం రూపురేకలు సమూలంగా మారిపోయి చాలా ఆహ్లాదకరంగా మారాయి. దాంతో జంటనగరాల నుంచి మైసమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు శామీర్‌పేట చెరువు వద్ద ఉల్లాసంగా గడిపి వెళుతున్నారు. మరొక వారం పది రోజులలో శామీర్‌పేట చెరువు సుందరీకరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.



Related Post