ఏ ఫర్ ఆదర్శ్..బి ఫర్ బోఫర్స్..

August 15, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ లో సమాధానం చెప్పారు. “అవినీతి గురించి మీరు మాట్లాడటమేమిటి రాహుల్ జీ? ఒక్కసారి వేదికమీద మీ పక్కన కూర్చోన్నవారిని చూడండి. వారిలో సగం మంది బెయిల్ పై బయటకు వచ్చినవాళ్ళే. మరికొంతమంది సిబిఐ కేసులు, మిగిలిన వారిపై అవినీతి కేసులు ఎదుర్కొంటున్నవారే. ఓహ్! నేను మరిచిపోయాను..మీది స్కాంగ్రెస్ పార్టీ అని. ఏ ఫర్ ఆదర్శ్..బి ఫర్ బోఫర్స్..సి ఫర్ కామన్వెల్త్ గేమ్స్...చాలా ఇంకా చెప్పమంటారా సార్?” అని ఎద్దేవా చేశారు.  Related Post