గన్‌పార్క్‌ దగ్గర ఉద్రికత్త

August 14, 2018


img

హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ అనుబంధ విద్యార్ధీ సంఘాల మద్య ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అయితే అక్కడికి ఆయన రాకవలన అమరవీరుల స్థూపం మలినమయిందంటూ టిఆర్ఎస్‌ విద్యార్ధి విభాగం నాయకులు అక్కడకు చేరుకొని స్థూపానికి పాలాభిషేకం చేయబోయారు. ఆ సామ్యంలో అక్కడే ఉన్న ఎన్ఎస్.యు.ఐ.విద్యార్ధి సంఘం నేతలు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మద్య కాసేపు తోపులాటలు జరిగి ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తక్షణమే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. 

రాహుల్ గాంధీ పర్యటిస్తే మాకెందుకు భయం..అభ్యంతరాలు? ఆయన పర్యటనను మేమేందుకు అడ్డుకొంటాము? అని ప్రశ్నించిన టిఆర్ఎస్‌, ఈరోజు విద్యార్ధి సంఘాల ద్వారా ఈ పరిస్థితి కల్పించి, కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను నిజం చేసింది. రాహుల్ గాంధీ హూందాగా వ్యవహరించి తిరిగివెళ్ళాలని సుద్ధులు చెప్పినప్పుడు, టిఆర్ఎస్‌ కూడా హుందాగా వ్యవహరించి ఉండాలి కదా?తెలంగాణాలో టిఆర్ఎస్‌ తప్ప మరే పార్టీకి ప్రవేశించే హక్కు లేదన్నట్లు ప్రవర్తించడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేరు.


Related Post