ఉస్మానియాలో రాహుల్ కు నో పర్మిషన్

August 10, 2018


img

ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం కాస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో సమావేశం అవ్వాలనుకొన్నారు. అందుకోసం యూనివర్సిటీలోని టాగూర్ ఆడిటోరియం ఇవ్వాలని కోరుతూ తెలంగాణా కాంగ్రెస్ నేతలు యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ కు లేఖ వ్రాయగా, రాహుల్ సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు జవాబిచ్చారు. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు వైస్ ఛాన్సిలర్ తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని 21 విద్యార్దీ సంఘాలు రాహుల్ గాంధీతో సమావేశానికి సిద్దపడగా, తెరాసకు అనుబంధంగా పనిచేస్తున్న టిఆర్ఎస్వి రాహుల్ గాంధీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.   

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సభను అడ్డుకోవడానికి తెరాస సర్కార్ ప్రయత్నిస్తోందని, విద్యార్ధి సంఘాలను రెచ్చగొడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. వారి ఆరోపణలను నిజమని నిరూపిస్తునట్లున్నాయి తాజా పరిణామాలు. Related Post