ఆయనకు కూడా నగర బహిష్కరణ?

July 11, 2018


img

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తునందుకు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ కు ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడం, మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్రకు సిద్దమైన స్వామీ పరిపూర్ణానందను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే. 

కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేసిన తరువాత డిజిపి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరానికి దేశంలో ఏ రాష్ట్రానికి చెందినవారైనా రావచ్చు.. పనిచేసుకోవచ్చు...హాయిగా జీవించవచ్చు కానీ భావప్రకటన స్వేచ్చపేరుతో ఇతరుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తామంతే చూస్తూ ఊరుకోము,” అని హెచ్చరించారు. 

స్వామీజీని గృహనిర్బంధం చేసిన తరువాత అయన ఏమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయనప్పటికీ, ఆయనను గృహనిర్బంధంలో ఉంచినందుకు హిందూసంస్థలు అందోళనలు మొదలుపెట్టడంతో ఆయనను కూడా నగరం నుంచి బయటకు తరలించక తప్పలేదు. హైదరాబాద్ పోలీసులు ఆయనను కూడా మంగళవారం రాత్రి నగరం నుంచి బయటకు తరలించారు. అయన స్వస్థలం కాకినాడ కనుక ఆయనను కూడా ఏపి పోలీసులకు అప్పగించి ఉండవచ్చు. 



Related Post