త్వరలో సిఎం కెసిఆర్ రాజస్థాన్ పర్యటన

June 23, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 26న రాజస్థాన్ లోని ప్రముఖ  అజ్మీర్ దర్గాను సందర్శించుకోబోతున్నారు. తెలంగాణా రాష్ట్రం నుంచి అజ్మీరు దర్గాను దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది ముస్లిం భక్తులు వెళుతుంటారు. అక్కడ వారు బస చేసేందుకు వీలుగా 5 ఎకరాల స్థలంలో ఒక విశాలమైన విశ్రాంతి భవనాన్ని నిర్మించి ఇస్తానని సిఎం కెసిఆర్ ఇదివరకు హామీ ఇచ్చారు. అజ్మీరు దర్గాను దర్శించుకున్నప్పుడు ఆ విశ్రాంతి భవనానికి సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రతీ జిల్లా నుంచి 25 మంది ముస్లింలు బయలుదేరుతున్నారు. తెలంగాణా ఉపముఖ్యమంత్రి మహ్మూద్ అలీ నేతృత్వంలో వారందరూ ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో అజ్మీర్ బయలుదేరుతారు. 



Related Post